
KCR Kaleshwaram:కాళేశ్వరం కమిషన్ విచారణకు మరి కాసేట్లో గులాబి దళపతి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట ఆయన హాజరవుతారు. ఈ విచారణలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సభ్యులు ఏ ప్రశ్నలు అడగనున్నారు. దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే విచారణకు రాబోతున్న కేసీఆర్ పై ఎలాంటి ప్రశ్నలు అడగాలనే దానిపై కమిషన్ ఇప్పటికే అన్ని రకాల ప్రశ్నలను సిద్దం చేసుకుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ అద్భుతం అన్న ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా పగుళ్లు ఏర్పడటం. దీనిలో కాంట్రాక్టర్ లోపంతో పాటు ఇంకా ఏదైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగనుంది.
ఇక విచారణ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్‌కు వెళతారు. విచారణ అనంతరం నందినగర్ వద్ద లంచ్ చేసి సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకుంటారు.
మరోవైపు విచారణకు ఎదురుకోవడానికి సిద్ధమేనంటున్న బీఆర్ఎస్ దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకునేందుకు ప్లాన్ చేసింది. కేసీఆర్ కు భారీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 500 కాన్వాయ్‌తో కేసీఆర్ ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి బయలుదేరనున్నారు. దారి పొడుగున ఆయనకు మద్దతు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మోహరించారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ప్లాన్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook