KTR Fires On CM Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినవాడు కేసీఆర్ అన్నారు. "దుర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి.. చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు.. ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని కథలు పడ్డా.. నీ 420 హామీలు నీ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి నువ్వు మరల్చాలని ప్రయత్నం చేసినా మల్ల నీయం.. ప్రజల తరపున అడుగుతానే ఉంటాం.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా.. నిన్ను వదిలిపెట్టం.. నీ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం..
కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్‌ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే ఇది హనుమంతుడు ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి.. ఇరిగేషన్ రంగం గురించి అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి ఏదో అడుగుతాం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అయితది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్‌గా తేలుతాయి. ధర్మం న్యాయమే గెలుస్తది. అల్టిమేట్‌గా కేసీఆర్ గారి పేరు తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.
ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. ఆరు గ్యారెంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. కచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్నీ ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యచరణ ఉంటుంది.
కేబినెట్ నిర్ణయం జరగకుండానే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లిందని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు. ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు. కేబినెట్ ఎట్లా పని చేస్తదో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు. ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు కావాలి. రాక్షస ఆనందం పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు.
నిజం గడప దాటే లోపల అబద్ధం అంగీలాగా వేసుకొని ఊరంతా తిరిగి వస్తది అన్నట్టు.. కొన్ని రోజులు కాళేశ్వరం అని.. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని.. కొన్ని రోజులు ఫార్ములా ఈ కేసు అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో.. ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం.. 100 జన్మలు ఎత్తినా.. రేవంత్ రెడ్డి అనే చిల్లర గానికి కేసిఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు." అంటూ కేటీఆర్ ఘటుగా మాట్లాడారు.
Also Read: Pawan Kalyan: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ ఇంటిపేరుతో ఉన్న గ్రామం..
Also Read: Kubera: నాగార్జున, ధనుశ్ ల ‘కుబేర’ మూవీ బడ్జెట్.. ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









