Kaleshwaram Project: కరువు నేలగా ఉన్న తెలంగాణను మాగాణిగా మార్చి.. బంగారం లాంటి పంటలు పండడానికి కేసీఆర్ కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. కాళేశ్వరమే లేకుంటే పంటలు పండేవి కావు.. బోరు బావుల్లో చుక్క నీరు ఉండేవి కావని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక 14 నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు తెలిపారు.
Also Read: Revanth Reddy Chit Chat: 'రాత్రికి రాత్రి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయలేం'
సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం విఠలాపూర్ రంగాయిపల్లి గ్రామాల వద్ద కాలువలోకి బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావ నీటిని వదలి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. 'కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న మూర్ఖులకు గలగల పొలాల్లో పారుతున్న నీరే సాక్ష్యం. ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుతున్నా' అని కాంగ్రెస్ పార్టీపై హరీశ్ రావు తెలిపారు.
Also Read: Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభం
'హైదరాబాద్‌లో.. గాంధీ భవన్‌లో కూర్చొని మాట్లాడటం కాదు. పల్లెల్లోకి వచ్చి గోదావరి జలాలను చూసి మేల్కోవాలని' కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. బంగారంలాంటి పంటలు పండుతున్నాయని, సిద్ధిపేట, యాదాద్రి, మెదక్ సహా తెలంగాణకు కాళేశ్వరం వర ప్రదాయిని అని పేర్కొన్నారు. కాళేశ్వరమే లేకుంటే పంటలు పండేవి కావు, బోరు బావుల్లో చుక్క నీరు ఉండేవి కావని చెప్పారు. 'రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, అనంతగిరి ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కావా?' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ప్రశ్నించారు.
'14 నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్ప కూలాయి. ఖమ్మం జిల్లాలో పెద్ద వాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పంప్ హౌజ్, ఎస్‌ఎల్‌బీసీ' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. అంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే రాజకీయం చేశారని గుర్తుచేశారు. 'మూసీకి, గండిపేటకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇస్తానంటున్నావు ఆ నీళ్లు గోదావరి నీళ్లు కాదా, కాళేశ్వరం నీళ్లు కావా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
Kaleshwaram waters, a lifeline to Telangana!
From the Vittalapur Canal to Rangaipally, the flow begins. Nourishing paddy fields, fulfilling farmers’ dreams!
This is #KCR garu‘s vision in action, a promise turned reality!#KaleshwaramProject pic.twitter.com/JdZgbJYIOq— Harish Rao Thanneeru (@BRSHarish) February 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









