kcr comments on Chandrababu naidu video: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్దం కోటల్ని దాటుతుంది. ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింతగా పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల మళ్లీ రంగంలోకి దిగారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చారు.
కాంగ్రెస్ కు కొంత సమయం ఇచ్చామని.. కానీ వారు చేసింది శూన్యమన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజల గోసను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ తాజాగా.. చేసిన వ్యాఖ్యలు మాత్రం రెండు తెలుగు స్టేట్స్ లలో హట్ టాపిక్ గా మారాయి. గోదావరిఖని నుంచి మాజీ ఎమ్మెల్యే.. కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి గులాబీ దళపతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు
బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు
ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు
అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారు కావాలి
తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి
పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు
ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది
ఆనాడు మోడీ నా… https://t.co/xwW3GSodLm pic.twitter.com/w5n9rEDbhp
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2025
వచ్చేది మన ప్రభుత్వమే నంటూ కార్యకర్తలలో, క్యాడర్ లో జోష్ ను నింపారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయన్నారు... సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. కొన్ని నెలలు ఇంకా కష్టపడితే.. తప్పకుండా మరోసారి మనం అధికారంలోకి రావడం పక్కా అన్నారు.
మరోవైపు మనం సింగిల్ గానే.. ఎవరితో పొత్తు పెట్టుకొకుండానే ప్రభుత్వంను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి సర్కారు పాలన గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడనే గెలిచారని అన్నారు. ఒకవేళ పొత్తులు లేకుంటే మాత్రం .. చంద్రబాబు గెలిచేవారు కాదని కూడా కామెంట్లు చేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హట్ టాపిక్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.