)
KTR Comments: బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇవాళ ఆయన ఏసీబీ విచారణ ఎదుర్కోనున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
రాజకీయ వేధింపులతో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టం మీద ఉన్న గౌరవంతో ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికి మూడు సార్లు విచారణకు పిలిచారని, ముప్పై సార్లు పిలిచినా హాజరవుతానన్నారు. తమపై కేసులు బనాయించి కమీషన్లతో ఇబ్బందులు పెట్టినా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపమన్నారు కేటీఆర్. కేసులకు భయపడి ప్రశ్నించకుండా ఉంటామనుకుంటే అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవివేకమన్నారు. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమీషన్ ముందు కూర్చొబెట్టిన పైశాచిక ఆనందం పొందుతున్నారని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు.
ఇప్పుడు తనను ఏసీబీ విచారణకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే తనను అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడరని, ఆ పరిస్థితి రావచ్చని తెలిపారు. తమకు జైళ్లు, కేసులు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చామన్నారు. ఫార్ములా ఈ రేసులో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. జైలుకు వెళ్లేందుకు భయం లేదని, ఎన్నిసార్లయినా వెళతామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఫేక్ ఆరు గ్యారెంటీలపై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుని గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వేళ మాత్రమే రైతు బంధు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దొంగ భాగోతాలు తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook