Rythu Bharosa: రైతులు వానాకాలం పంటల సాగుకు రెడీ అవుతున్న ఈ సమయంలో రైతు భరోసా ఆర్ధిక సాయం వారికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. వారంలోగా రైతు భరోసా నిధుల పెండింగ్ డబ్బులను క్లియర్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రైతు భరోసా ఉన్న వారితో పాటు కొత్తగా మరికొంత మంది రైతు భరసా పైసలు ఇవ్వడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో మాదిగానే ఒక ఎకరా ఉన్నవాళ్లకు ముందుగా రైతు భరోసా నిధులు అందనున్నాయి. ఆ తర్వాత రెండెకరాలు.. ఆపై ఐదెకరాలు ఉన్న రైతులు ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతులు కేవైసీ పూర్తి చేయడంతో పాటు వాళ్ల ఖాతాలకు సంబంధించి బ్యాంక్ వాళ్లు అడిగే అన్ని డీటెల్స్ పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆదేశించినట్టు సమాచారం. మొత్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు రైతులు ఖాతాల్లో పూర్తి స్థాయిలో నిధులు పడేటట్టు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
కేంద్ర విడుదల చేసే డబ్బులు ఠంచనుగా పడుతున్నా.. రేవంత్ సర్కార్ ఇచ్చే డబ్బులు మాత్రం ఎపుడు వస్తాయే తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. పైగా కేంద్రం ఇచ్చే డబ్బులు కేవలం రెండుకరాల వరకే వర్తింపజేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఐదెకరాలు ఉన్న రైతుల వరకు రైతు భరోసా డబ్బులు వేయనున్నారు. గత ప్రభుత్వం భూమిపై ఎలాంటి లిమిట్ లేకుండా అందరికీ రైతు బంధు నిధులను అందజేసింది. రేవంత్ రెడ్డి వచ్చాకా.. రైతు బంధును రైతు భరోసాగా మార్చి కేవలం ఐదెకరాలకే స్ట్రీమ్ లైన్ చేసింది.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









