RTA: 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనం అయితే...ప్రతి ఒక్కరు ఈ రూల్స్ పాటించాల్సిందేనని ఆర్డర్ పాస్ చేసింది. టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ వరకు ఏవైనా సరే ఇకపై ఈ నంబర్ ప్లేట్‌ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణాశాఖ సెప్టెంబరు 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా 320 రూపాయలు.. గరిష్ఠంగా 800 రూపాయలుగా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా....సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతోంది. ఇప్పుడు పాత వాహనాలకూ దీన్ని తప్పనిసరి చేశారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
పాత వాహనాలకు కొత్తనంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణాశాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా.. కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారు ఇంటికే వెళ్లి నంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుం తీసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు మార్గ దర్శకాలు అని చెబుతున్నా.. ఇలాంటి చర్యలతో మామలు వాహనదారుల జేబులకు చిల్లు పెట్టడమే అంటున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









