Telangana SC Reservation: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్ట రూపం దాల్చింది. అయితే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భ:గా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన దామోదర్ రాజ నర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
మార్చి 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి 18న అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 19న శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్ భవన్‌కు చేరి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో చట్టంగా ఆమోదం పొందింది.
తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభిజించి గవర్నమెంట్ కు లేఖ అందజేసింది. అదే బిల్లులో పొందు పరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74 శాతంగా ఉంది. వీరికి వారికి 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇధి చట్టంగా అమల్లోకి రాబోతున్నట్టు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసింది.
మొత్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతృత్వంలో గత 30 యేళ్లుగా ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఆ కల నిజం కావడంతో అది భారత రాజ్యంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజున అమల్లోకి రావడం విశేషం అనే చెప్పాలి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









