Bhu Bharati: నేటి నుంచి తెలంగాణలో భూ భారతి చట్టం..

Bhu Bharati: తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ స్థానంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 09:30 AM IST
Bhu Bharati: నేటి నుంచి తెలంగాణలో భూ భారతి చట్టం..

Bhu Bharati Act: తెలంగాణలో నేటి నుంచి భూ భారతి చట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముందుగా మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో దీనిని  ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు భూభారతి పోర్టల్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు.  పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తారు.

Add Zee News as a Preferred Source

ఇక జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయిం. అదే సమయంలో ధరణిలో అక్రమాలపై  త్వరలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తామని  ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

అయితే నిన్నటి వరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ -2020 రద్దు చేసిన ఆ స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో భద్రతాపరమైన పలు సెక్షన్స్ పొందుపరిచారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు పట్టా భూములున్న వాళ్లకు ఎవరు పడితే.. వాళ్లు ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ చట్టం అడ్డు పడుతుంది. ఈ చట్టాన్ని సంబంధఇంచిన కోదండరెడ్డి , మాజీ ఐఎఎస్ రేమండ్ పీటర్, న్యాయ కోవిదుడు భూమి సునీల్ సునీల్ కుమార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి  భూ భారతి చట్టానికి రూపకల్పన చేశారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News