New Ration Cards in Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వచ్చే ఏప్రిల్ నుంచి జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి BPL కార్డులు, ఎగువన ఉన్నవారికి APL కార్డులు ఇచ్చే ఆలోచన లో ప్రభుత్వం ఉంది.
ఇప్పుడు ట్రైకలర్‌లో బీపీఎల్ కార్డులను, గ్రీన్ కలర్‌లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యకా అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త వాటిని ఇష్యూను చెయ్యలేదు. పాత వాటినే కంటిన్యూ చేస్తూ వస్తోంది. 2014 లో కొత్త పెళ్లైన వాళ్లకు మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు.
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాటినే కొనసాగించింది. కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో కొన్ని చోట్ల మాత్రం ఇచ్చామంటూ కొన్ని రేషన్ కార్డులను ఇష్యూ చేశారు. ఆ తర్వాత కొత్త పెళ్లైన వాళ్లకు మాత్రం అసలు రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డు విధివిధానాలు ప్రకారం BPL, APL అంటూ రెండు విధాలుగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయనున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం కూడా చేశారు. మొత్తంగా ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులను విడతల వారీగా ఇష్యూ చేయనున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









