)
Local Body Elections Update: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు మంత్రులతో మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, తదితర విషయాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని.. రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు సమాచారం. అయితే, ఎన్నికల నిర్వహణ విషయంపై తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీల కాలపరిమితి చాలా కాలం క్రితం ముగిసింది. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపారు. గవర్నర్ దానిని రాష్ట్రపతి అనుమతి కోసం పంపారు. ఇప్పటికీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది.
ఇటీవల హైకోర్టు ఈ ఎన్నికలపై కీలక తీర్పు ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం మంచిదని మంత్రులు సీఎంకు సలహా ఇచ్చారు. ఒకవేళ ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేయలేకపోతే, హైకోర్టును మరింత గడువు కోసం ఆశ్రయించాలని నిర్ణయించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కానీ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. కేంద్రం నుంచి కూడా స్పందన రాలేదు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా జీవో జారీ చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. అలాగే, న్యాయపరమైన సమస్యలు వస్తే, బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా ఉంది.
ఇక ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లతో ఉత్తర్వులు జారీ చేసి.. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతను చర్చించనున్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook