)
Hydraa Funds: హైడ్రాకు రాష్ట్ర బడ్జెట్లో ముందస్తుగా నిధులు కేటాయించకపోయినా, అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. హైడ్రాకు విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకనుంచి హైడ్రాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా ఉంటుందని మ్యాచింగ్ గ్రాంట్ గా రూ.20 కోట్ల రూపాయలు విడుదల చేశారు. గత కొంతకాలంగా ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిధుల విడుదలతో పెండింగ్‌లో ఉన్న వేతనాలను క్లియర్ చేయడానికి మార్గం సుగమం అవుతుందని సంబంధిత అధికారులు స్పష్టంచేశారు.
హైద్రాబాద్ పరిసరాల్లో కబ్జాకు గురైన భూముల్ని కాపాడటం, ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకోవడం, కబ్జాకుగురైన చెరువుల్ని కాపాడే పనిలో బిజీగా ఉండే హైడ్రా..ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యలకు సంబంధించిన వాళ్ల విషయంతో పాటు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీల వ్యవహారంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో పేదలకు సంబంధించిన గుడిసెల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్న హైడ్రా.. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి అండగా ఉన్న ఎంఐఎం పార్టీ విషయంలో ఓ రకంగా.. సామాన్యుల విషయంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన లాండ్ ఇష్యూలో మరోలా వ్యవహరిస్తోందనే ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. హైడ్రా వర్షాకాలంలో వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి అనుకోని పరిస్థితుల్లో హైడ్రా ముందుండి సహాయ చర్యలు చేపడుతుంది. అలాంటి సందర్భాల్లో రిస్క్ తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు చాలా కాలంగా వేతనాలు అందక నిరాశలో ఉన్నారు. ఈ కొత్త నిధుల మంజూరుతో వారి సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభించనుంది. అదనపు నిధుల మంజూరుతో హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆధునిక పరికరాలు, రక్షణ సామాగ్రి కొనుగోలు చేయడంలో ఈ నిధులు ఉపయోగపడతాయి. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో హైడ్రా వేగవంతంగా స్పందించగలదు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో విపత్తు నిర్వహణకు ఎప్పటికప్పుడు నిధులు, సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన రూ. 69 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన రూ. 20 కోట్ల గ్రాంట్ కలిపి హైడ్రా పనితీరుకు మద్దతుగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు. మరి హైడ్రా కూడా అందరి విషయంలో ఒకేలా ప్రవర్తించాలని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.