Telangana Tourism: దేశ విదేశాల నుంచి పర్యాటక పరంగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు తెలంగాణ కొత్త పాలసీ సిద్దం చేసిన ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఈ పాలసీ ద్వారా 15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక రంగం ద్వారా 3 లక్షల మంది అదనపు ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమౌతోంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపింది. రాష్ట్ర ఆదాయంలో 10 శాతం ఆదాయం ఈ రంగం ద్వారా దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ప్రభుత్వ భూముల్ని లీజుకు ఇవ్వనుంది. ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం పోర్టల్ రూపొందించనుంది. ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలు పొందుపరుస్తారు. ప్రచారం కోసం డిజిటల్ మార్కెటింగ్ వేదికల్ని ఉపయోగించనున్నారు. ఇందులోనే స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజం భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో పర్యాటక స్థలాల సమాచారం, ప్రాధాన్యత గురించి ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అంశాలు, వివిధ ప్రాంతాల చారిత్రక నేపధ్యం, ఎక్కడ స్టే చేయవచ్చు, భోజనం, రవాణా సదుపాయాలు ఎలా ఉంటాయి వంటి వివరాలన్నీ ఒకే చోట లభించేలా తెలంగాణ టూరిజం శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే పోర్టల్ దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 27 పర్యాటక ప్రాంతాలు గుర్తించింది.
తెలంగాణలో 27 పర్యాటక ప్రదేశాలు
వికారాబాద్, సోమశిల, కాళేశ్వరం, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్ ప్రాంతాలతో పాటు ట్రైబల్ సర్క్యులేట్‌లో జోడేఘాట్, ఉట్నూరు, ఉషేగావ్, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, ఎకో టూరిజం ఉన్నాయి. ఇక చార్మినార్ జోన్‌లో లాడ్ బజార్, మక్కామసీదు, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 14వ శతాబ్దం నాటి కాకతీయుల కట్టడాలు, ప్రాకృతిక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కోటలు, దేవాలయాలు, సరస్సులు, రాతి కట్టడాలను ఇకపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక పండుగ బోనాలు,బతుకమ్మ, సమ్మక్క సారక్క ఉత్సవాలను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు. వీటితో పాటు కొత్తగా అడ్వెంచర్ టూరిజం, కార్వాన్ పార్క్, హౌస్ బోట్స్ వంటివి కొత్తగా రానున్నాయి.
ఇక ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయనుంది ప్రభుత్వం. సీసీ కెమేరాలు, పోలీసుల గస్తీ పెరగనుంది. మహిళలకు ప్రత్యేక భద్రత ఉంటుంది. కీలక ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుంది. పర్యాటక ప్రాంతాలు పూర్తిగా సురక్షితమనే భావన కల్గించే చర్యలు చేపట్టనుంది. ప్రైవేటు సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలోని పర్యాటకాన్ని అభివృద్ధి చేయ సంకల్పించింది.
పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు
అడ్వెంచర్ టూరిజంలో కనీస పెట్టుబడి 25 లక్షలు ఉండాలి. సబ్సిడీ 25 శాతం ఉంటుంది. కారవాన్ ప్రాజెక్టులో పెట్టుబడి 25 లక్షలయితే సబ్సిడీ 25 శాతం ఖరారు చేసింది ప్రభుత్వం. అదే విదంగా టూర్ ఆపరేటర్ల కారవాన్‌లో కనీస పెట్టుబడి 25 లక్షలయితే సబ్సిడీ ఇందులో కూడా 25 శాతం ఉంటుంది. హౌస్ బోటింగ్ ప్రాజెక్టుల్లో కనీస పెట్టుబడి 1 కోటి రూపాయలు ఉంటే సబ్సిడీ 25 శాతం ఉంటుంది.
Also read: Today Gold & Silver Rate: 90 వేల మార్క్‌కు చేరుతున్న పసిడి, ఇవాళ మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









