Telangana: తెలంగాణ విద్యార్ధులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది.దీంతో తెలంగాణ విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 1, 2025, 08:45 AM IST
Telangana: తెలంగాణ విద్యార్ధులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Telangana Govt: తెలంగాణలో  ఇప్పటి వరకు కొనసాగుతున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ  రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా-డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15శాతం ఓపెన్ కేటగిరి సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్స్ పోటీపడే అవకాశం ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఫులుస్టాప్‌ పెట్టింది.  

Add Zee News as a Preferred Source

స్థానికత, అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ పలు కోర్సుల్లో అడ్మిషన్లలో స్థానికత అంశంపై పలు రకాల సిఫార్సులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కమిటీ సూచనలను పరిశీలించిన సర్కార్‌  తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 85శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అలాట్ చేయనుంది. స్థానికత, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆ సీట్లను కేటాయిస్తుంది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

15శాతం సీట్లను తెలంగాణ స్థానికత ఉండి, ఇతర రాష్ట్రాల్లో చదువుకునేవారితో భర్తీ చేయనుంది. అయితే, తెలంగాణలో పదేళ్ల పాటు నివాసముండాలనే షరతును ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికితోడు చదువుకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఉపయోగపడనుంది.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News