Betting Apps: బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న సెలబ్రిటీల విషయంలో తొక్కిపెట్టి నార తీయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను సిట్‌కు ఐజీ M. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు.
ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు.
మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం పెద్ద పెద్ద తలకాయలను పక్కన పెట్టి చిన్న వాళ్లను టార్గెట్ చేసారనే ఆరోపణలున్నాయి. కేవలం చిన్న చిన్న పాత్రలు వేసుకునే వాళ్లను తెలంగాణ ప్రభుత్వం పట్టుకునే ప్రయత్నం చేస్తుందనే విమర్శులు వున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉన్న పెద్ద హీరోలు, సెలబ్రిటీలు.. కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ లపై నిషేధం తీసుకొచ్చిన యేడాది ముందే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకున్నట్టు .. ఆ తర్వాత వద్దన్నా.. వాళ్లే ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారనే కోణంలో తాము ఎలాగో ఈ కేసు నుంచి బయట పడేలా మన న్యాయ వ్యవస్థలోని లూప్స్ హోల్స్ ను ఉపయోగించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









