SC Reservation Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం.. ఫస్ట్ స్టేట్ గా తెలంగాణ రికార్డు..

SC Reservation Bill: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్‌  ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. గవర్నర్​ఆమోద ముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2025, 09:45 PM IST
SC Reservation Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం.. ఫస్ట్ స్టేట్ గా తెలంగాణ రికార్డు..

SC Reservation Bill: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనుంది. గత నెల 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా,  మార్చి 18న అసెంబ్లీ ఆమోదించింది. మార్చి 19న కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ బిల్లు రాజ్ భవన్‎కు చేరి ఆమోదం పొందింది.

Add Zee News as a Preferred Source

జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటిని ఉన్నది ఉన్నట్లుగా ఎస్సీ వర్గీకరణ బిల్లులో పొందుపరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18  కులాలను గ్రూప్ 2లో చేర్చారు.  

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74 శాతం ఉండగా.. వారికి 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా,  వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్​ ఆమోదముద్ర వేయడంతో  ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. దీంతో ఇన్నాళ్లూ పెండింగ్​ లో ఉండిన ప్రభుత్వ జాబ్ ​నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేసేందుకు డిపార్ట్​మెంట్లవారీగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి.

విద్య, ఉద్యోగాలు, లోకల్ ​బాడీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల 17న అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించి.. రాజ్‌ భవన్‌ ‎కు పంపిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్‌ వద్దనే  పెండింగ్‎లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..​బీసీ రిజర్వేషన్‌ బిల్లులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News