)
Telangana Schools Holiday: మొంథ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ తీవ్రంగా ప్రభావితమవుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది. తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఈ కారణంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్ష ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. వర్షాలకు జనజీవనం స్తంభిస్తోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా వర్షం ప్రభావం ఉంది. ఈ వర్షాలు వ్యవసాయానికి చేటు చేస్తున్నాయి. ఈ వర్షాలకు రైతుల రెక్కల కష్టం నీటి పాలవుతోంది. చేతికొచ్చిన పంటలు నీటిలో తడిచిపోయాయి. ఆరబోసిన వడ్లు నీటిలో మొలకలు ఎత్తాయి. వర్షాల ముప్పు మరో రెండు రోజులు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్నీ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల క్షేమం దృష్ట్యా వర్ష ప్రభావి జిల్లాల్లో కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లాలు
వరంగల్
హనుమకొండ
యాదాద్రి భువనగిరి
సిద్దిపేట
కరీంనగర్
జనగామ
బలహీనపడిన మొంథా తుఫాను
తీవ్ర ప్రభావం చూపిన మొంథ తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. గంటకు 18 కిలో మీటర్ వేగంతో తీవ్ర అల్పపీడనం కదులుతోంది. వచ్చే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు 180 కిలో మీటర్ దూరంలో తీవ్ర అల్పపీడనం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి