Control Room: భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Telangana Govt Established Control Room At Telangana Bhavan: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పౌరుల కోసం తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ను ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. ఏవైనా సహాయం కోసం తెలంగాణ పౌరులు దీనిని సంప్రదించవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 9, 2025, 04:49 PM IST
Control Room: భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

India Pakistan War: పాకిస్థాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర పౌరుల భద్రత.. క్షేమం కోసం కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయగా.. తాజాగా తెలంగాణ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల కోసం ఈ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. అక్కడ నివసిస్తున్న వారు ఎలాంటి సహాయమైనా పొందేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: India Pakistan War: పాకిస్థాన్‌తో యుద్ధం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత? వాస్తవమేమిటి?

సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాలలో ప్రస్తుతం నివసిస్తున్న.. చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Also Read: India Pak War: పాకిస్థాన్‌కు మద్దతుగా యువతి పోస్టులు.. హైదరాబాద్‌లో తీవ్ర కలకలం

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా సేవలను అందించేందుకు 24 గంటలు పని చేస్తుంది. భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలు ఎలాంటి సేవల కోసమైనా ఈ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్రజల పౌరుల భద్రత, వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కూడా ఈ కంట్రోల్‌ రూమ్‌ సహాయ పడనుంది. ఎవరైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ సహకారం అందించనుంది.

కంట్రోల్‌ రూమ్‌ సహకారం పొందేందుకు కింది నంబర్లను సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్  రెసిడెంట్  కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

ల్యాండ్‌లైన్: 011-23380556

వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్ – 98719 99044

హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు – 99713 87500

జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – 96437 23157

సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 99493 51270

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News