)
Bathukamma Indiramma Sarees: తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తయింది. మరో 10 లక్షల చీరలు తయారవుతున్నాయి. ఈ నెల 23 నుంచి ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను రేషన్ కార్డుల ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ చీరలను స్వయం సహాయ సంఘాల ద్వారా అందిస్తోంది. మొదట మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దసరాకు ఒక చీర, సంక్రాంతికి మరో చీర ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల చేనేత కార్మికులకు చీరల తయారీ కోసం ఆర్డర్ ఇచ్చారు. 50 లక్షల చీరలు తయారయ్యాయి. మరో 5 లక్షల చీరలు తయారీ దశలో ఉన్నాయి. చీరల సేకరణ కోసం ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈ చీరలను సెర్ప్ మరియు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు పంపిణీ చేస్తారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.
ఈ చీరలు లైట్ బ్లూ కలర్లో ఉంటాయి. వాటికి డార్క్ బ్లూ అంచు ఉంటుంది. చీరలపై తెల్లని రంగు పూల డిజైన్లు ఉంటాయి. సాధారణ చీరలు బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్ మహిళలకు 9 మీటర్ల చీర ఇస్తారు. ఒక్కో చీర తయారీకి సుమారు 800 రూపాయలు ఖర్చయిందని అధికారులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook