HCU 400 Acres Issue: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 400 ఎకరాల భూమిపై తెలంగాణ ప్రభుత్వం మొండిగానే ముందుకువెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూములు హెచ్‌సీయూకి సంబంధించినవి కావని.. అవి ప్రభుత్వానివేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా భూముల చరిత్రను మొత్తం ప్రభుత్వం వివరించింది. చంద్రబాబు కేటాయించినప్పటి నుంచి నేటి వరకు జరిగిన ఉదంతాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.
Also Read: KTR Reaction On HCU Lands: హెచ్‌సీయూ భూ ఉద్యమానికి కేటీఆర్ సంపూర్ణ మద్దతు.. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం
'400 వందల ఎకరాలు హెచ్‌సీయూలోనే ఉందని అందరూ భావించారు. కానీ టీడీపీ ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి ఐఎంజీకి అప్పగించింది. ఆ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న గోపన్‌పల్లిలో ప్రభుత్వం కేటాయించింది. బదిలీ ప్రక్రియపై విశ్వవిద్యాలయ అధికారులు సంతకాలు చేశారు' అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. 'వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకోవాలి. అబద్ధాలనే కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్ముతుందేమో అని ప్రజలు అనుకోవద్దు' అని విజ్ఞప్తి చేశారు.
Also Read: HCA SRH Dispute: సన్‌రైజర్స్ వార్నింగ్‌పై రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
'ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల కోసం ప్రయత్నం చేయలేదు. మళ్లీ మేం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చాక మన భూమికి కోసం కొట్లాడి భూమిని సాధించుకున్నాం. ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్న భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది సాధించింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిన మమ్ములను అభినందించాలి' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
'రాష్ట్ర ప్రజల భవిషత్ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాం. దీనిలో మా స్వార్థం, మా సీఎం స్వార్థం ఏమీలేదు' అని భట్టి ప్రకటించారు. 'అనాడు రాజీవ్ గాంధీ హైటెక్ సిటీకి పునాది వేస్తేనే నేడు లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది' అని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 400 ఎకరాలు యూనివర్సిటీ భూములు కావని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకోవడం లేదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









