)
Employees Salary Hike: ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారికి భారీగా వేతనాలు పెంచేసింది. 15 శాతం మేర జీతాలు పెంచుతూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం దక్కనుంది. ఇన్నాళ్లు తమ వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన తీపి కబురు ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైద్య విద్య చదువుతూనే వైద్యులుగా పని చేస్తున్న మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా ప్రభుత్వం పెంచేసింది. స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
జీతాల పెంపు ఇలా..
==> ప్రభుత్వం తాజాగా పెంచిన 15 శాతంతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 లభించనున్నాయి.
==> పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరంలో రూ.67,032 పెరగనుండగా.. ద్వితీయ సంవత్సరంలో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ పెరగనుంది.
==> సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున భారీగా స్టైఫండ్ అందుతుంది.
==> సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వైద్యారోగ్య శాఖలో హర్షం
ఈ పెంపుతో వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా తమ స్టైఫండ్, గౌరవ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం కరుణించింది. 15 శాతం పెంపుతో మెడికోలు, పీజీ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఊరట లభించింది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాని కృతజ్ఞతలు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.