Group 2 Results 2025: నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాగా ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 783 ఖాళీల భర్తీకు గత ఏడాది ఆగస్టులో జరిగిన పరీక్షల ఫలితాలివి. ఈ ఫలితాల కోసం అభ్యర్ధులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం.
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల ఫలితాల కోసం అభ్యర్ధులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 783 ఖాళీల భర్తీకై 2022లో విడుదలైన నోటిఫికేషన్ ఇది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమై 2024 డిసెంబర్ నెలలో పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మొత్తం నాలుగు సెషన్లలో జరిగాయి. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ ఉదయం, మద్యాహ్నం రెండు పూటలు జరగగా పేపర్ 3, 4 పరీక్షలు డిసెంబర్ 1వ తేదీన జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గ్రూప్ 2 పరీక్షలు రాసిన అభ్యర్ధులు తమ ఫలితాలను https://www.tspsc.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 పరీక్షకు మొత్తం 5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 51 వేల 486 మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 2 పరీక్షల ప్రొవిజనల్ ఆన్సర్ కీను ఇప్పటికే జనవరి నెలలో విడుదల చేశారు.
గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
ముందుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో అభ్యర్ధి సర్వీస్ సెక్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ గ్రూప్ 2 సర్వీస్ పైనల్ ఆన్సర్ కీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కన్పిస్తుంది. అది క్లిక్ చేయాలి. అంతే మీ ఫలితాలు కన్పిస్తాయి.
గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేందుకు జనరల్ కేటగిరీకు కటాఫ్ మార్కులు 40 శాతం కాగా ఓబీసీ కేటగిరీకు 35 శాతం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ పీహెచ్ కేటగరీ అయితే 30 శాతం ఉంది. ఫలితాలు చెక్ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు అవసరమౌతాయి.
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇప్పటికే నిన్న విడుదలయ్యాయి. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
Also read: Nomination Tension: మూడు విమానాలు, 14 నిమిషాల గడువు ఉత్కంఠ రేపిన నామినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









