Half Day Schools: తెలంగాణలో మార్చ్ 15 అంటే శనివారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు , ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 23 వరకూ ఒంటి పూట బడులు కొనసాగి ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.
తెలంగాణ విద్యార్ధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అటు ఒంటి పూట బడులు, ఇటు వేసవి సెలవులు రెండూ ప్రకటించింది. మార్చ్ 15 శనివారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు ఒక పూటే పనిచేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని తెలిపింది. ఆ తరువాత అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఎండలు తీవ్రంగా పెరుగుతుండటంతో విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించింది. గత ఏడాది మార్చ్ 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాగా ఈ ఏడాది కొద్దిగా ముందే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. పదవ తరగతి విద్యార్ధులకు మాత్రం మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి.
ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా కన్పిస్తోంది. ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతుండటంతో విద్యార్ధులకు ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 2 చివరి రోజు కానుంది. తిరిగి జూన్ 11 లేదా 12 తేదీల్లో స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి.
ఏపీలో ఒంటి పూట బడులు
ఏపీలో కూడా ఒంటి పూట బడులు ప్రారంభించేందుకు విద్యాశాఖ యోచిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో మార్చ్ 18 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి మార్చ్ 15 లేదా 17 నుంచి ప్రారంభం కావచ్చు. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు జారీ కావల్సి ఉన్నాయి.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీలో మార్చ్ 17 నుంచి మార్చ్ 31 లేదా ఏప్రిల్ 1 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో అయితే మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకూ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఉంది.
Also read: AP Education System: ఏపీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, కొత్తగా సెమిస్టర్ విధానం, నో స్కూల్ బ్యాగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









