Telangana High Court Adjourn: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయంగా లబ్ధి పొందేందుకు అడ్డగోలుగా బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు యత్నిస్తుండడంతో దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లపై బుధవారం సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూడగా తీరా రేపటికి వాయిదా పడడంతో రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: BC Reservation Live Updates: బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా.. హైకోర్డు సంచలనం
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. మొదట విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశంపై 23 ఇంప్లీడ్ పిటిషన్‌లు దాఖలు కాగా వాటన్నింటినీ ఒకేసారి వింటామని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ తెలిపింది. తదనుగుణంగా హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి బలంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావించారు.
Also Read: KTR: రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి కిరాయిలు కూడా కట్టలేవా? కేటీఆర్ నిలదీత
అయితే రేపే నామినేషన్లు ప్రారంభమవుతుండగా హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదించగా.. హైకోర్టు పట్టించుకోలేదు. హైకోర్టులో పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించడంతో కొంత అనుకూలంగా వస్తుందని అందరూ భావిస్తున్నారు.
Also Read: Vijay: 'మీకు నేనున్నా'.. కరూర్ తొక్కిసలాట బాధితులతో హీరో విజయ్ వీడియో కాల్
'బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగింది. 97 శాతం ఇంటింటి సర్వే జరిగింది. బిల్లును గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదు.. తిరస్కరించలేదు' అని ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









