)
Telangana high court gives big relief to Senior ias smita Sabharwal: తెలంగాణలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై రేవంత్ రెడ్డి సర్కారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందని, లక్షల కోట్ల ప్రజాధనంను వృథా చేశారని ఆరోపణలు చేసింది. దీనిపై పీసీ ఘోష్ కమిషన్ కూడా వేసింది.
అయితే.. ఈ కమిషన్ లో గత పాలకులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లకు సంబంధించి అనేక మంది అధికారులపై కూడా చర్యలు తీసుకొవాలని పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనిలో సీనియస్ ఐఏఎస్ అధికారిణి పేరు ఉండటం పెను సంచలనంగా మారింది.
కాళేశ్వరంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిలో నోటీసుల జారీ, వాంగ్మూలంను నమోదు చేసిన విధానంను అధికారిణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఆ నివేదికను కొట్టివేయాలని కోరారు. తదుపరి చర్యలు తీసుకొకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా సీనియర్ అధికారిణి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దాఖలైన పిటీషన్లతో కలిపి చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనిపై విచారించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సీనియర్ అధికారిణికి మాత్రం బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.