Telangana highcourt on kancha Gachibowli controversy: హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని కంచ గచ్చి బౌలీలోని హెచ్‌సీయూ భూములపై వివాదం తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. వట ఫౌండేషన్, వర్సీటీ విద్యార్థులు ప్రత్యేకంగా పిటిషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ లను మరోసారి విచారించిన హైకోర్టు.. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలంగాణ హైకోర్టు చెప్పింది. అదే విధంగా ప్రతివాదులకు ఈనెల 24 లోపు కౌంటర్ ను దాఖలు చేయాలని ఆదేశించింది.
మరోవైపు ప్రతివాదుల తరపున లాయర్ లు.. కొంత మంది కావాలని ఏఐ ఫెక్, ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేశారని కోర్టు వారి ముందు విన్నవించారు. ఆ భూమి వర్సీటీది కాదని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువైపుల వారి వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, టీజీఐఐసీకి కౌంటర్ ను దాఖలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా కేసును ఈనెల 24 కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూముల వివాదంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసును విచారించిన విషయం తెలిసిందే.
దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు సైతం పెట్టింది. ఓవర్ నైట్లో బుల్డొజర్లతో యూనీవర్సీటీలోకి వెళ్లడంమేంటని మండిపడింది. అదే విధంగా వందల చెట్లు నరకడంపై కూడా తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే.. సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తు.. కోర్టు హెచ్‌సీయూ భూముల వివాదంపై స్టేను విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యూనివర్సీటీ పరిధిలో అన్ని పనులు నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు
మరోవైపు.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తప్పుడు, మార్ఫింగ్ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పోస్టులు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా.. ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌కు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









