)
Telangana highcourt key comments on 42 percent bc quota: తెలంగాణలో ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్‌లో ఉండగా, మీరు జీవో విడుదల చేసి, ముందుకు పోతామంటే ఎలా?.. అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపు లాయర్లపై ప్రశ్నలు సంధించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదని, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉందని కూడా స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలు వేసింది.
దసరా సెలవుల తర్వాత దీనిపై తమ వాదనలు వినాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు. దీంతో పూర్తిగా మీరు చెప్పినప్పుడు వింటామని జడ్జి చెప్పారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న అడ్వకేట్ జనరల్ కోర్టు వారికి చెప్పారు.
ఈ క్రమంలో.. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో నోటిఫికేషన్ కు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని కోర్టుకు తెలిపింది. మరోవైపు.. నోటిఫికేషన్ వచ్చినా, ఈ పిటిషన్లను మెరిట్ ఆధారంగా విచారిస్తామని హై కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇరువైపుల వాదనలువిన్న హైకోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి