TS Local Body Elections: మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కీలక తీర్పు

TS Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు తీర్పు నేపధ్యంలో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2025, 01:35 PM IST
TS Local Body Elections: మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కీలక తీర్పు

TS Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల నగారా మోగనుంది. కేవలం మూడు నెలల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే పరిస్థితి కన్పిస్తోంది. హైకోర్టు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విధంగా ఎదురుదెబ్బే కానుంది. 

Add Zee News as a Preferred Source

తెలంగాణలో గ్రామ పంచాయితీల గడువు ముగిసిన అప్పుడే ఏడాదిన్నర పూర్తయింది. అయినా ఎన్నికలు లేకపోవడంతో పలువురు మాజీ సర్పంచ్‌లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ అంటే జూన్ 25న కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటి నుంచి మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని జస్టిస్ మాధవి దేవి బెంచ్ స్పష్టం చేసింది. వాస్తవానికి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు గడువు గత ఏడాది 2024 జనవరి 31తో ముగిసింది. అయితే వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా వేస్తోంది ప్రభుత్వం. పంచాయితీల నిర్వహణ బాధ్యతను కూడా ప్రత్యేక అధికారులకు అప్పగించేసింది. దాంతో ప్రజా సమస్యలు మూలనపడ్డాయని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ధిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో చాలా ప్రాంతాల్లో సర్పంచ్ లు తమ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేయించారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోవడంతో ఆ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఎన్నికలు జరిపించాలని లేకపోతే పాత సర్పంచ్‌లకే బాధ్యతలు అప్పగించాలని కోరారు. 

ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పెండింగులో ఉన్నందున మరో నెల రోజులు గడువు అవసరమని వాదించింది. ఎన్నికల ప్రక్రియకు రెండు నెలల సమయం పడుతుందని తెలిపింది. అయితే గతంలో ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇరు వర్గాల వాదనల అనంతరం మూడు నెలల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దాంతో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయి. 

Also read: EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 5 లక్షల వరకు విత్‌డ్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News