High Court Serious On Hydra: దమ్ముంటే పెద్దల జోలికి వెళ్లి చెప్పండి, హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

High Court Serious On Hydra: అక్రమార్కులపై కొరడా పేరుతో వ్యవహరిస్తున్న హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా దృష్టిలో సంపన్నుల కోసం ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించింది. హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 12:32 PM IST
High Court Serious On Hydra: దమ్ముంటే పెద్దల జోలికి వెళ్లి చెప్పండి, హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

High Court Serious On Hydra: హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న నీటి వనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా ఆ దిశగా వెళ్తున్నట్టు కన్పించడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. హైడ్రా దృష్టిలో రాష్ట్రంలోని సంపన్న వర్గాలకు లేదా ప్రముఖులు ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించడం ఆలోచింపచేస్తోంది. 

Add Zee News as a Preferred Source

హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఈసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడింది. హైడ్రా టార్గెట్ కేవలం పేద, మధ్య తరగతి ప్రజలేనా అని ప్రశ్నించింది. హైడ్రా పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించిన న్యాయస్థానం ఆ నిర్మాణాల్లో నిబంధనలు పాటించారా లేదా అనేది పరిశీలించాలని కోరింది. అసలు సంపన్నుల కోసం హైడ్రా ప్రత్యేక చట్టాన్నే అమలు చేస్తోందా అని నిలదిసింది. 

ఈ క్రమంలోనే ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేద, మధ్య తరగతి ఇళ్లను కూల్చి మీడియాలో ఫోటోలు వేయించుకోవడం కాదని, మియాపూర్, దుర్గం చెరువుతో పాటు ఇతర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన ప్రముఖుల పరిస్థితి ఏంటని న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే 2 వేలకు పైగా సరస్సులు, చెరువులతో ఉండేదని ఇప్పుడు కనీసం 200 కూడా లేవని న్యాయస్థానం తెలిపింది. పెద్దల అక్రమ నిర్మాణాలు కూల్చినప్పుడే హైడ్రా సార్ధకత నిలబడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటి ప్రభుత్వాల కంటే నాడు నిజాం చేపట్టిన చెరువు పరిరక్షణ చర్యలే పకడ్బందీగా ఉన్నాయని హైకోర్టు వెల్లడించడం విశేషం. 

రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్వే నెంబర్ 329-1, 329-2, 329-3 పరిధిలోని ఆరు ఎకరాల భూమిపై తహశీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ఫాతిమా సహా మరో వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రాపై గట్టిగా అక్షింతలు వేసింది. 

Also read: AP Assembly Speaker: వైసీపీ సభ్యులు దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News