Telangana Hight Court Verdict In Dilsukh Nagar: దిల్‌షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. 2013 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితులైన తహసిన్ అక్తర్, భక్తల్, ఎజాజ్, రెహమాన్ కు ఉరిశిక్ష విధించింది. ఇప్పటికే NIA కోర్ట్ కూడా వీళ్లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 2016లో యాసిన్ భత్కల్‌తో సహా ఐదుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. NIA తీర్పు సరైనదే అని నేడు తెలంగాణ హైకోర్టు కూడా ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇక దిల్‌షుక్ నగర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. .
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌షుక్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ భయానక దృశ్యాలు ఇప్పటికి హైదరాబాద్ వాసులు మర్చిపోలేరు. కేవలం 150 మీటర్ల వ్యాసార్థం లోనే రెండు బాంబులు పేలిపోయాయి. దిల్‌షుక్ నగర్ ఉగ్రవాదుల దుశ్చర్యతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. దిల్‌షుక్ నగర్‌లోని కోణార్క్ థియేటర్ వద్ద ఘటన జరిగింది ఇక మరో పేలుడు వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబు పేలింది. సైకిల్ పై టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అప్పట్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా.. హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే ఉన్నారు.
ఇంప్రూవైజ్డ్ డివైజ్ బాంబులను అమర్చిన ఉగ్రవాదులు ముందుగానే హైదరాబాద్ దిల్‌షుక్ నగర్‌లో రెక్కీ వేసి కొన్ని రోజులు పాటుగా అక్కడే ఉండి అదను చూసి బాంబు బ్లాస్ట్ కు తెగబడ్డారు. ఇక ఈ బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కాకుండా పది ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా బాంబు బ్లాస్టులకు ఈ ప్రధాన కారణం ప్రస్తుతం బీహార్ జైల్లో శిక్ష భావిస్తున్నాడు. అయితే మక్బుల్ మాత్రం 2024లో మృతి చెందాడు ఇక మిగతా వాళ్ళకి నేడు తెలంగాణ హైకోర్టు గురు శిక్ష విధించింది.
READ ALSO: స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్ కొడుకు మార్క్ శంకర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









