
TS Inter Results 2025 Out: తెలంగాణ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాదిలానే ఈసారి కూడా బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్‌గా మొదటి సంవత్సరం 66.89 శాతం ఉత్తీర్ణత ఉంటే ద్వితీయ సంవత్సరం 71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాలను tgbie.cgg.gov.in ఇలా చెక్ చేసుకోండి.
ఇవాళ ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో మొత్తం రెండు సంవత్సరాలు కలిపి 9.97 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,88,430 మంది విద్యార్ధులు ఉంటే రెండో ఏడాది నుంచి 5,08,582 మంది ఉన్నారు. ఇక ఈసారి కూడా బాలికలదే అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. మొదటి ఏడాదిలో బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలు రెండింట్లోనూ బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం దాదాపు 20 శాతం అధికంగా ఉండటం విశేషం. బాలికలతో పోలిస్తే బాలురు అంతలా ఎందుకు వెనుకబడ్డారనేది ఆశ్చర్యంగా ఉంది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను tgbie.cgg.gov.in ద్వారా నేరుగా తెలుసుకుని మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 76.55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 30 వరకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి