Telangana Intermediate 2025 Results: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది. ఈ నెల ఏప్రిల్ 22వ తేదీన ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇక విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.in, results.cgg.gov.in రెండిటిలో చెక్ చేసుకోవచ్చు. మొదటగా ఏప్రిల్ 20వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు అన్నారు. అయితే కొన్ని కారణాల నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీ పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనికి మీరు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
tsbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైటులోని హోం పేజీలో 'టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2025' లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాలు అనే లింక్ ఉంటుంది. అది జనరల్ /ఒకేషనల్ అని ఎంపిక చేసుకోవాలి. టీఎస్ ఇంటర్ రిజల్ట్ విండో ఓపెన్ అవుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఆధారంగా పరీక్ష ఫలితాలను పొందవచ్చు.
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 6 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక 2024లో ఏప్రిల్ 24వ తేదీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 2023లో మే 9, 2022లో జూన్ 28 తేదీల్లో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఇదీ చదవండి: ఇప్పుడు రీఛార్జీ చేసుకుంటే 2026 వరకు ఏప్రిల్ వరకు బంపర్ బెనిఫిట్స్.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ డీటెయిల్స్..
అయితే ఇంటర్ పరీక్షల పాస్ అవ్వడానికి ప్రతి సబ్జెక్టులో 35% మార్కులు స్కోర్ చేసి ఉండాలి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా కల్పిస్తారు. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రోజు కర్కాటక రాశికి కీలకం.. సింహం అనసరమైన విషయాలు అవసరంలేదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









