Telangana Inter Calendar: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యకు చెందిన పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. రానున్న ఏడాదిలో ఎన్ని రోజులు కళాశాల ఉంటుంది, ఎప్పుడు పరీక్షలు ఉంటాయి, ఎప్పుడు సెలవులు ఉంటాయనే వివరాలతో కొత్త అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది.
తెలంగాణలో రానున్న విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించి జూనియర్ కళాశాలల అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ఈ క్యాలెండర్‌లో రానున్న విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులు కళాశాల పనిచేస్తుంది, ఎన్ని రోజులు సెలవులుంటాయి, ఎప్పుడు పరీక్షలు ఉంటాయనేది స్పష్టంగా ఉంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 2 నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాదిలో మొత్తం 226 పనిదినాలు ఉంటాయి. నవంబర్ 10 నుంచి 15 వరకు హాఫ్ ఇయర్ పరీక్షలు ఉంటాయి. జనవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చ్ మొదటి వారంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చ్ 31 కళాశాలలకు చివరి పనిదినంగా ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఎప్పుడెప్పుడుంటాయో పరిశీలిద్దాం. ఈ ఏడాదిలో అంటే వచ్చే విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ ఉంటాయి. జూన్ 1, 2026న ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమౌతాయి.
Also read: AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు, వాట్సప్ ద్వారా మార్క్స్ మెమో ఎలా తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









