Telangana Inter Exams: మొన్న ఇంగ్లీషు నిన్న బోటనీ మేథ్స్ పేపర్లలో అన్నీ తప్పులే, విద్యార్ధుల్లో ఆందోళన

Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పుల తడకగా కొనసాగుతూ విద్యార్ధుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న ఇంగ్లీషు పరీక్ష నిన్న,ఇవాళ బోటనీ-మేథ్స్ పరీక్షల్లో తప్పులు దొర్లడంతో విద్యార్ధుల్లో కలవరం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2025, 03:27 PM IST
Telangana Inter Exams: మొన్న ఇంగ్లీషు నిన్న బోటనీ మేథ్స్ పేపర్లలో అన్నీ తప్పులే, విద్యార్ధుల్లో ఆందోళన

Telangana Inter Exams: ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో రెండో పరీక్ష నుంచే అంతా గందరగోళం నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక ప్రశ్నాపత్రంలో తప్పులు బయటపడుతున్నాయి. ప్రశ్నాపత్రంలో తప్పులతో మార్కులపై ఆందోళన పట్టుకుంది విద్యార్ధులకు. ఇంగ్లీషు, బోటనీ, మేథ్స్ ఇలా అన్ని పరీక్షల్లో అదే తప్పు రిపీట్ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

తెలంగాణ ఇంటర్ పరీక్షలు తప్పుల తడకగా, పూర్తి గందరగోళంతో జరుగుతున్నాయి. ఇంటర్ రెండవ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షలో 7 ప్రశ్న సరిగ్గా ముద్రణ కాక విద్యార్ధులు అయోమయానికి గురవడంతో 4 మార్కులు కలుపుతామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రశ్నాపత్రంలో తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ జరిగిన బోటనీ పేపర్ లో 5, 7 ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయి. గణితం పేపర్‌లో కూడా 4వ ప్రశ్న తప్పు ఉంది. నిన్న జరిగిన పరీక్షలో కూడా మూడు పేపర్లలో తప్పులు దొర్లాయి. ఇలా రోజూ ఏదో ఒక ప్రశ్మాపత్రంలో తప్పులు దొర్లుతుండటంతో కష్టపడి చదివిన విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. మార్కుల టెన్షన్ పట్టుకుంది. ప్రశ్నాపత్రాల్లో ఇవే తప్పులు కొనసాగితే తమ భవిష్యత్ ఏంటనే ఆందోళన నెలకొంది. ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు దొర్లిన పేపర్ల విషయంలో విద్యార్ధులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్ధులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి మార్చ్ 25 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,88,448 మంది విద్యార్ధులు హాజరవుతుంటే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,08,523 మంది విద్యార్ధులు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమేరాలు, పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. 

Also read: Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News