
Telangana Inter Results 2025: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం పరీక్ష పత్రాల వాల్యుయేషన్ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. tsbie.cgg.gov.in ద్వారా ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.
తెలంగాణలోని ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్. మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకూ జరిగిన ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాల కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 96 వేల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఫలితాలు విడుదల కానున్నాయి. గత ఏడాది ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదలయ్యాయి. అంతకంటే ముందు 2023లో మే 9న విడుదలయ్యాయి. 2022లో జూన్ 28న ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. 2021లో జూన్ 28న ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ఇంటర్ ఫలితాలు రావచ్చని అంచనా.
ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కన్పించే ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల లింక్ క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.
ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 1 నుంచి 20 వరకూ జరిగాయి. ప్రస్తుతం పరీక్ష పత్రాల వాల్యుయేషన్ దాదాపుగా పూర్తయింది. ఏప్రిల్ 12-15 మధ్యలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్ బోర్డ్ సిద్దమౌతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి