Telangana Inter Exams: ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 25వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఇంటర్మీడియట్ బోర్డు ఒక్క నిముమిషం నిబంధనను సడలిస్తూ ...5 నిమిషాల గ్రేస్ పీరియడ్ సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల ప్రశ్నా పత్రాలు మొత్తం 18 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ రోజు (మార్చ్ 5) నుంచి మార్చ్ 15 వరకూ జరగనున్నాయి. రెండో ఏడాది పరీక్షలు మార్చ్ 6 నుంచి 20 వరకూ జరుగుతాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
72 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్ ఐదు టీంలతో సెట్టింగ్స్ స్క్వాడ్ ఇంటర్ పరీక్షలు పర్యవేక్షిస్తారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4లక్షల 88వేల 448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, ఫోన్లను నిషేధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఉంటే సంప్రదించేందుకు ఇంటర్ బోర్డ్ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









