TG Inter Hall Tickets: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల చేసింది. మార్చ్ 5 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మార్చ్ 6 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ లేకుండా పరీక్ష హాల్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
ఇటీవల నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇవాళ తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విద్యార్ధులు తమ హాల్ టికెట్లను సులభంగా ఇంట్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మార్చ్ 5 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఇవాళ విడుదలయ్యాయి. వీటిలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 9.50 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో మూడు సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయి. ఎంట్రీ గేట్, ప్రశ్నాపత్రం ఓపెన్ చేసే ప్రిన్సిపాల్ రూమ్, కళాశాల వెనుక ఇవి ఉంటాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన లేక హాల్ టికెట్ లేకపోయినా పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉండదు. హాల్ టికెట్లపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ స్టాంప్ లేదా సంతకం అవసరం లేదు. విద్యార్ధులు నేరుగా హాల్ టికట్లు డౌన్‌లోడ్ చేసుకుని తీసుకెళ్లవచ్చు.
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎలా
ముందుగా ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు హోమ్ పేజీలో కన్పించే Download Hall Tickets March 2025 క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పుట్టిన తేదీ, గత సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాసే విద్యార్ధులు పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, రెండో ఏడాది విద్యార్ధులు మొదటి ఏడాది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్
మార్చ్ 5 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చ్ 7 ఇంగ్లీషు పేపర్ 1
మార్చ్ 11 మేథ్స్ పేపర్ 1ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చ్ 13 మేథ్స్ పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 17 ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
మార్చ్ 19 కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
మార్చ్ 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మేథ్స్
మార్చ్ 24 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 జియాగ్రఫీ
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్
మార్చ్ 6 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చ్ 10 ఇంగ్లీష్ పేపర్ 2
మార్చ్ 12 మేథ్స్ పేపర్ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చ్ 15 మేథ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 18 ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్
మార్చ్ 20 కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్
మార్చ్ 25 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2 జియాగ్రఫీ
Also read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









