TG Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాక అంతా తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఈ పరీక్షలు 5 రోజుల తేడాతో ముగిశాయి. ఇప్పుడు తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ దాదాపుగా ఖరారైంది. ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 25 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. రెండోసారి వెరిఫికేషన్ కూడా పూర్తయింది. మార్కుల కంప్యూటరీకరణ దాదాపుగా పూర్తయింది. దాంతో ఇక ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మార్చ్ 5 నుంచి మార్చ్ 24 వరకు జరిగితే ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చ్ 6 నుంచి మార్చ్ 25 వరకు జరిగాయి.
ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటరీకరణ అంతా దాదాపుగా పూర్తవడంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు విడుదల చేయనుంది. తెలంగాణ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 18న విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్ధులు తమ హాట్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in. ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందులో కన్పించే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2025 లింక్ క్లిక్ చేసి మొదటి సంవత్సరమా లేదా ద్వితీయ సంవత్సరమా అనేది ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు స్క్రీన్‌పై ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
Also read: TG SSC Results 2025: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు కాస్త ఆలస్యం, ఎప్పుడు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









