TG Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 24 వరకూ జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈసారి మూల్యాంకనంలో కొత్త విధానం అనుసరిస్తున్నారు. మూల్యాంకనం తరువాత ఫెయిల్ అయిన విద్యార్ధుల ప్రశ్నాపత్రాల్ని మరోసారి వెరిఫై చేస్తున్నారు. తద్వారా ఎక్కడా ఎలాంటి తప్పులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ పూర్తి కానుంది. ఆ తరువాత ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.
ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన తరువాత రీ వాల్యుయేషన్‌కు అవకాశం ఉంటుంది. దీనికోసం సబ్జెక్టుకు 600 రూపాయలు వసూలు చేయనుంది. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను https://tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మీ హాల్ టికెట్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్‌పై మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. అది కాకుండా వాట్సప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Also read: Telangana SSC Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు , ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









