Telangana jagruthi leaders protest at tgpsc office over group 1 issue: తెలంగాణలో ప్రస్తుతం గ్రూప్ 1 వివాదం రేవంత్ సర్కారుకు తలనొప్పిగా మారింది. దీనిపై మరల ఎగ్జామ్ నిర్వహించాలని అపోసిషన్ పార్టీలు పట్టపడుతున్నాయి. ముఖ్యంగా జాబ్ లను అమ్ముకున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలో.. తెలంగాణ జాగృతి నాయకులు మంగళవారం సుమారు 400 మంది జాగృతి కార్యకర్తలు, నాయకులు రెండు విడతలుగా టీజీపీఎస్సీని ముట్టడించి ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు.
గ్రూప్ - 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్
చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు.తెలంగాణ జాగృతి నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు. pic.twitter.com/MNTfpi6Ff4
— Telangana Jagruthi (@TJagruthi) September 16, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లోపాలతో గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించిన విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ఎత్తి చూపిందన్నారు. అదేవిధంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు అన్యాయం చేసే జీవో నం.29 నుంచి మొదలుకొని ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు.
నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు గ్రూప్ -1 పోస్టులను అమ్మకానికి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం పంతానికి పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మ బలికి నిలువునా ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందని జాగృతి నాయకులు మండిపడ్డారు. అసెంబ్లీలో జాబ్ లెస్ బోగస్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
జాగృతి నాయకుల అరెస్టు.. ఠాణాలకు తరలింపు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. టీజీపీఎస్సీ గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన నాయకులను లాఠీలతో కొట్టారు.
అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో పలువురు జాగృతి నాయకులకు గాయాలయ్యాయి. అరెస్టు చేసిన తెలంగాణ జాగృతి నాయకులను నాంపల్లి, అబిడ్స్, గాంధీ నగర్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈక్రమంలో టీజీపీఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









