)
Telangana Local body Election Notification: తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ నగారా మోగించింది. అక్టోబర్ 9 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముదిని ప్రకటించారు. ముందుగా ఎలక్షన్ కమిషన్ మండల ప్రజా పరిషత్ (MPTC), (జిల్లా పరిషత్ ) ZPTC కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తైయిన తర్వాత పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ప్రొసీజర్స్ ను ప్రభుత్వం పూర్తి చేసింది. పంచాయతీలకు మూడు దశల్లో కలిపి మొత్తం 5 ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఫేజ్ రెండు వారాల నుంచి 15 రోజుల్లో పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లు డబ్బులు చేతులు మారనున్నాయి. మరోవైపు మద్యం ఏరులై పారనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సహా బీఆర్ఎస్, బీజేపీ తన వ్యూహాలను పదును పెడుతుంది. ఇక ప్రధానమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించిన అక్టోబర్ 9 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదిన మొదటి దశ, 27న రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు గ్రామ పంచాయితీలకు అక్టోబర్ 31న .. నవంబర్ 4, మూడో దశలో నవంబర్ 8న నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
ఎలక్షన్స్ పూర్తైయిన వెంటనే అదే రోజు గ్రామ పంచాయితీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును చేపడతామన్నారు. నవంబర్ 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో 5749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహిస్తామన్నారు. 12,733 గ్రామ పంచాయితీలు, 1,12,288 వార్డుల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 15522 గ్రామపంచాయతీ పోలింగ్ లొకేషన్లో గుర్తింపు నిచ్చారు. తెలంగాణ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. గతంలో ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయోచ్చనే నిబంధన తీసుకొచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు పిల్లలను నిబంధన ఎత్తివేశారు. కానీ తెలంగాణలో మారని ముగ్గురు పిల్లల నిబంధన. తెలంగాణలో పోటీ చేసే వారికి ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో కోటీ 67లక్షల 3168 మంది ఓటర్లులున్నారు. అందులో పురుషులు.. 81 లక్షల 65,894.. ఆడవాళ్లు.. 85 లక్షల 36,770 మంది ఓటర్లులున్నారు. గతంలో మాదిరే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.