Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో జరుగుతున్నాయి. రెండు విడతలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మూడు విడతలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని 2,963 ఎంపీటీసీ స్థానాలు, 292 జడ్పీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరిస్తున్నారు అధికారులు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి 11 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న పోలింగ్ ఉంటుంది. రెండో విడత ఎన్నికల నామినేషన్ అక్టోబర్ 13 నుండి 15 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ 27 న పోలింగ్ నిర్వహిస్తారు. రెండవ విడతలో 2,786 ఎంపీటీసీ స్థానాలు, 273 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగనుంది.
ఇక సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 17 నుంచి 19 వరకు స్వీకరించి అక్టోబర్ 31న పోలింగ్ తో పాటు రిజల్ట్ ఉంటుంది.
రెండవ విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 21 నుంచి 23 వరకు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తారు. మూడవ విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 25 నుంచి 27 వరకు స్వీకరించి నవంబర్ 8న పోలింగ్ రోజునే రిజల్ట్ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల733 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణ పల్లెల్లో ఎలక్షన్స్ రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









