)
Telangana Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల జాబితాను కూడా రెడీ చేయాలని సిఎస్ రామకృష్ణారావు కూడా ఆదేశించారు సీఎం రేవంత్. ఇక 42% రిజర్వేషన్ ఉండేలా వార్డులు, గ్రామపంచాయతీలు, జడ్పీ చైర్మన్ సీట్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కూడా కేటాయించాలన్నారు. ఇక మహిళలకు 50 శాతం సీట్లను లాటరీ ద్వారా నిర్ణయిస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు బంజరా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల విషయంలో మరింత వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులను ఇంకా ఆమోదం పొందలేదు.
బీసీలకు 42 శాతం..
సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వు ఉన్న అంశంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా జీవోలు విడుదల చేసి అధికారికంగా 42% రిజర్వేషన్లు కల్పించి అనే అంశంపై చర్చించారు. ఇక ఆ తర్వాత ఎన్ని స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. ఈ ప్రక్రియను కూడా మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించగా ఎస్సీలకు 15%, ఎస్సీలకు 10 శాతం చొప్పున ఖరారు చేయాలని తెలిపారు. ఒక వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో కూడా వస్తుందని ఈలోపు అన్ని రెడీగా ఉండాలని సీఎస్‌కు సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈనెలాఖరులోనే స్థానిక ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అక్టోబర్ నెలలో పూర్తి చేస్తామని కాస్త గడువు కూడా ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ వేయనున్నట్లు తెలుస్తోంది.42 శాతం బిల్లు ఆమోదం ఇంకా తెలుపకపోయినా రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా జీవో జారీ చేసి మరి ఎన్నికలు నేరుగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇక న్యాయపరమైన సమస్యలు వస్తే బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళుతుంది. ఇక ఈనెల 25వ తేదీ లోపు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పిటిసిలు, 5763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు ఇక పరోక్షంగా 565 మండల పరిషత్తులు 31 జిల్లా పరిషత్తుల చైర్పర్సన్ లో కూడా ఎన్నికల్లో నిర్వహించనుంది.
ఇక ఎస్సీ ఎస్టీ విషయం ఇలా విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన 50% సీట్లను మహిళలకు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో మిగిలిన సీట్లను మాత్రం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook