
Local Body Elections New Rule : తెలంగాణ.. పంచాయతీ ఎలక్షన్స్ లో ముగ్గురు పిల్లల నిబంధన మారుతుంది అని ఎదురుచూసిన వాళ్లకు నిరాశ ఎదురయింది. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు పోటీ చేయడానికి అనర్హులు అని తేల్చి చెప్పేశారు..గతంలో ముగ్గురు పిల్లలు నిబంధన తీసుకువచ్చిన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు మాత్రం ఆ నిబంధనను తీసేసి ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని వచ్చారు.
ఇక తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామపంచాయితీలతో పాటుగా, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని కూడా విడుదల చేశారు. తెలంగాణలో పెద్ద పండుగ తర్వాత ఒక పెద్ద రాజకీయ సమరానికి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 31 జిల్లాలలో 565 మండలాలలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
ఈ క్షణం నుంచి ఎన్నికల నిబంధనలు కూడా అమలులోకి వస్తాయంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించారు. అక్టోబర్ 23వ తేదీన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి మొదట పోలింగ్ జరుగుతుంది. అదే నెల 27వ తేదీన రెండో విడత పోలింగ్ కూడా నిర్వహిస్తామంటూ తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పిటిసిలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల విషయానికి వస్తే..12,733 లకుగాను,1,12,288 వార్డు నెంబర్లకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. 31 జిల్లాలలో 565 మండలాలలో ఈ ఎన్నికల నిర్వహించేందుకు పూర్తి షెడ్యూల్ ని కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతలలో జడ్పిటిసి , ఎంపిటిసి ఎన్నికలు నిర్వహిస్తారని అలాగే మూడు విడతలల గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.
అక్టోబర్ 23, 27 న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగగా.. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్లు SC తెలిపింది. ఇక పోలింగ్ జరిగిన రోజు పంచాయితీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించే విధంగా షెడ్యూల్ ని ఖరారు చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. తక్షణమే ఇప్పుడు ఎన్నికల కోడ్ అయితే అమలులోకి ఉన్నది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.