Telangana Local Body Elections BC Reservataions Controersy: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పై పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిన్న సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో ఫోన్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో చర్చించారు. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నిన్నఆదివారం ఢిల్లీ వెళ్లారు. వారి వెంట బీసీ సంక్షేమం, సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు. జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరఫున వాదన లు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో వారు భేటీ అయ్యారు. కులగణన సర్వే మొదలుకుని జీవో 9 జారీకి దారి తీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆయన కు వివరించారు.
జీవో 9ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా.. దానిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. అయితే ఆ జీవోకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, సంఘాలతో హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే..సుప్రీంకోర్టులోనూ జీవో 9కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉన్నందున..అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెబుతుందా? లేక ఏదైనా సూచన చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో.. చట్ట విరుద్దమంటూ పిటిషన్‌దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడంలో న్యాయవాదులకు సహకారం అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అధికారులు ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









