Telangana Local Body Elections First Phase: తెలంగాణ తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Telangana Local Body Elections First Phase:తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లు .. పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 01:10 PM IST
Telangana Local Body Elections First Phase: తెలంగాణ తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం..

ఈసారి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో కలిపి 10 వేల 279 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్​ నిర్వహించనున్నారు. తొలి విడతలో దాదాపు 3 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్ చేపడతారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.  పోలింగ్‌ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత ఉప సర్పంచ్​ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది.ఈసారి గ్రీన్​ పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్లను చైతన్యం చేసేలా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా.. 13 వేల 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

37 వేల 440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9 వేల331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67 వేల 893 మంది పోటీలో ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున ఆరుగురు బరిలో నిలిచారు. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్​ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడిది​ తెలుపు రంగులో ఉంటుంది. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News