)
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్లు తో కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైనా.. ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో 27న పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్‌లు ఏర్పాటు చేసి, రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేసారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను ప్రచురించి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది. ఆ మరుసటి రోజు 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు 26, 27వ తేదీల్లో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టు ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.