తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్; ఆన్ లైన్ దరఖాస్తుకు ఛాన్స్

తెలంగాణలో మరో సారి ఎన్నికల సమర భేరి మ్రోగింది

Updated: Apr 20, 2019, 05:17 PM IST
తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్; ఆన్ లైన్ దరఖాస్తుకు ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తున్న ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు కాగా మే 27న ఫలితాలు విడులవుతాయి. తెలంగాణలో మొత్తం 538 జెడ్పీటీసీ... 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

షెడ్యూల్ విడుదల చేసిన నేఫథ్యంలో  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈసారి ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ వేసే సౌలభ్యాన్ని కూడా కల్పించారు. ఐతే అప్లికేషన్ పూర్తయ్యాక ప్రింట్ అవుట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.