)
Telangana Local Body Elections Will be Postponed: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెలాఖరులో లోకల్ బాడీ ఎలక్షన్స్ ను నిర్వహించాలని క్యాబినేట్ లో తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా BCలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని క్యాబినేట్ తీర్మానం చేసింది.
అందుకోసం ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం పంపిన బిల్లులు, రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఆమోదం తరువాతే ఎన్నికలకు వెళ్ళాలని సర్కార్ భాస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ బిల్లులపై వారి వద్ద నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంతోంది. ఇలా వుండగా ఈ నెల 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే కదా. అయితే రేవంత్ రెడ్డి ఈ బిల్లులో బీసీల పేరుతో ముస్లిమ్స్ కు అడ్డదారిలో రిజర్వేషన్స్ కు కల్పించేలా ఈ బిల్లులో ఉంది. అందులో ముస్లిమ్స్ లేకుండా ఉంటే బిల్లు పాస్ అయ్యేలా చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సందర్బాల్లో వ్యాఖ్యానించారు. అయితే.. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని కొంత మంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదించడం జరిగే పని కాదంటున్నారు. దీనికి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అని చెప్పాలి. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోతే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్స్ నిలిచే పోయే అవకాశాలున్నాయి. మరి దీనిపై రేవంత్ సర్కారు ఎలాంటి విధాన పరమైన నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.