Konda Surekha Emotional: రాజకీయాలు.. ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగారు. భావోద్వేగానికి లోనయి కన్నీటి పర్యంతమయ్యారు. తట్టుకోలేక ఏడ్చేశారు. తాను ఆత్మీయంగా చూసుకుంటున్న పెంపుడు కుక్క ఆకస్మిక మరణంతో ఆమె తట్టుకోలేకపోయారు. ఇన్నాళ్లు తన వెంట తిరుగుతూ సందడి చేస్తూ కలియతిరిగిన ఆ కుక్క లేకపోవడంతో సురేఖ ఆవేదనకు లోనయ్యారు. తనను వదిలి వెళ్లిపోయిన కుక్కకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అంత్యక్రియలు చేయించారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Weather Update: తెలంగాణకు 'చల్లటి కబురు'.. రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
మంత్రి కొండా సురేఖ హ్యాపీ అనే పేరు మీద ఓ పెంపుడు కుక్కను పోషించుకుంటున్నారు. ఎప్పుడూ ఇంట్లో సందడి చేస్తుంటుంది. హ్యాపీతో కొండా సురేఖకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఎంతో అల్లారు ముద్దుగా ఆమె చూసుకుంటున్నారు. తన కుటుంబంలో ఓ మనిషిగా పెరిగి.. ఎంతో విశ్వాసం చూపిస్తున్న హ్యాపీ గురువారం ఆకస్మిక మరణం పొందింది. గుండెపోటుతో చనిపోయిందని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సురేఖ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుక్క మరణంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
Also Read: Teenmar Mallanna: 'ఏ పార్టీలోకి వెళ్లడం లేదు.. కొత్త పార్టీ పెట్టడం లేదు': తీన్మార్ మల్లన్న
తమతో ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న హ్యాపీ ఇకలేదని తెలిసి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కుక్క కళేబరానికి పుష్పాంజలి ఘటించి నమస్కారం చేశారు. అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొండా సురేఖతోపాటు ఆమె కుటుంబసభ్యులు, ఆమె సిబ్బంది కూడా హ్యాపీ మరణంతో కలత చెందారు. వారు కూడా కుక్కకు నివాళులర్పించారు. హ్యాపీ మరణంతో కొండా సురేఖ కుటుంబంలో తీరని లోటుగా మారింది. విదేశాల్లో ఉంటున్న సురేఖ కుమార్తె కూడా హ్యాపీ మృతితో ఆవేదన చెందారని సమాచారం.
Hyderabad: Minister @KondaSurekha in tears after the sudden death of her beloved pet dog 'Happy'. Surekha performed the last rites of 'Happy', who died of a heart attack. #KondaSurekha pic.twitter.com/QkoxOLCSg5
— Pinky Rajpurohit ?? (@Madrassan_Pinky) March 6, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









